News March 10, 2025

సిద్దిపేటలో విషాదం.. తల్లి తిట్టిందని బాలుడి సూసైడ్

image

క్షణికావేశంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

Similar News

News September 19, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.

News September 19, 2025

వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

image

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్‌పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.

News September 19, 2025

HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

image

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్‌ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.