News February 20, 2025
సిద్దిపేటలో వ్యక్తి హత్య..?

సిద్దిపేట పట్టణంలోని నర్సాపురం రోడ్డు మైసమ్మ గుడి వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఓ వ్యక్తి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు.. మృతుడు సిద్దిపేటకు చెందిన బోదాసు శ్రీనివాస్గా గుర్తించారు. అతడు హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏసీపీ మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News December 1, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయం కిక్కిరిసింది.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
కేఎంటీపీలోకి అమెరికా పత్తి బేళ్లు ప్రవేశం!

WGL కేఎంటీపీ వస్త్ర పరిశ్రమలకు అమెరికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే 13 కంటెయినర్లు రాగా, త్వరలో మరో 15 కంటెయినర్లు రానున్నాయి. ఇటీవల ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేయడంతో విదేశీ బేళ్లు దేశీయ బేళ్లకంటే చౌకగా మారాయి. కైటెక్స్, యంగ్వన్ వంటి కంపెనీలు విదేశీ బేళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. సీసీఐ ద్వారా రాష్ట్రంలోనే సరిపడా బేళ్లు లభిస్తున్నా, విదేశాలవి రావడంపై ఆగ్రహంగా ఉన్నారు.


