News February 4, 2025
సిద్దిపేటలో 14 మందికి జరిమానా

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి రూ.22,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్లు వెల్లడించారు.
Similar News
News February 25, 2026
కరీంనగర్: 400 మంది విద్యార్థులు గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 15,389 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 14,989 మంది మాత్రమే పరీక్ష రాశారని జిల్లా విద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, గైర్హాజరు మినహా పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని తెలిపారు.
News February 25, 2026
కరీంనగర్: పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం ప్రారంభమైన మొదటి సంవత్సరం పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిఘా, వసతులను పరిశీలించి, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 25, 2026
లండన్‌లో పెద్దాపురం యువకుడి మృతి

లండన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. క్రోయిడాన్ డప్పాసి హిల్ టెర్రస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. 2023లో ఎంబీఏ చదివేందుకు అభిషేక్ లండన్ వెళ్లారు. అభిషేక్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.


