News February 4, 2025

సిద్దిపేటలో 14 మందికి జరిమానా

image

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి రూ.22,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్లు వెల్లడించారు.

Similar News

News February 14, 2025

పెన్షన్లు తెచ్చిన సీఎం ఈయనే

image

దామోదరం సంజీవయ్య 1960-62 వరకు CMగా ఉన్నారు. ఈయనది కర్నూలు జిల్లా పెద్దపాడు. అవినీతి అధికారులను పట్టుకునే ఏసీబీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గవర్నమెంట్ టీచర్లకు, వృద్ధులకు పెన్షన్ తీసుకొచ్చారు. కాపు కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారు.
*ఇవాళ ఆయన జయంతి

News February 14, 2025

శ్రీకాకుళం: దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు

image

మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

News February 14, 2025

దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

image

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!