News January 30, 2025

సిద్దిపేట: అఘోరీపై కేసు నమోదు

image

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో అఘోరీ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కత్తులతో భక్తులపై దాడి చేయడంతో అక్కడ ఉన్న భక్తులు భయందోళనకు గురయ్యారు. అనంతరం ఆలయ సభ్యులు అఘోరీకి దర్శనం చేయించి పంపించినా.. భక్తులపై కత్తితో దాడి చేయడంపై సిద్దిపేట సీపీ అనురాధ సీరియస్ అయ్యారు. సీపీ ఆదేశాలతో బుధవారం అఘోరీపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 1, 2025

హైదరాబాద్‌లో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

HYD సనత్‌నగర్‌లోని <>ESIC<<>> సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో 45 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి MD/MS, DM/M.CH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 10, 11,12, 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,671, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,70,681, Asst. ప్రొఫెసర్‌కు రూ.1,46,638, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: esic.gov.in

News December 1, 2025

HYD: ఇక పర్యాటక రంగానికి ఏఐ సేవలు

image

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఏఐ సహాయంతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. టూరిస్టులు చూసే ప్రదేశాలు సమయం చెప్తే దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. దక్కన్ ఎక్స్‌ప్లోరర్ తన కార్డుతో ఈ సేవలను అందించడానికి రూపకల్పన చేస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో నైట్ టూరిజంను పెంచేందుకు చూస్తోంది.

News December 1, 2025

ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.