News September 19, 2024
సిద్దిపేట: అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటిన చింతమడక విద్యార్థినిలు

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింతమడక జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు సత్తా చాటారు. 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్-1480 మీటర్ల, జెళ్ల అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఈనెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని HM కొత్త రాజిరెడ్డి తెలిపారు.
-CONGRATS
Similar News
News February 27, 2026
తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు
News February 26, 2026
మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.
News February 26, 2026
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.


