News February 4, 2025

సిద్దిపేట: అధికారులకు అదనపు కలెక్టర్ సూచనలు

image

జాతీయ నులీ పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అందరు అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పైన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు.

Similar News

News December 4, 2025

విష్ణుమూర్తిని ఎందుకు కొలవాలి?

image

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||
అన్నింటినీ నియంత్రించే ఈశానుడు, ప్రాణాన్నిచ్చే ప్రాణదుడు, గొప్పవాడైన జ్యేష్ఠుడు, సకల జీవులకు ప్రభువైన ప్రజాపతి, బంగారు గర్భం కల్గిన హిరణ్యగర్భుడు, భూమిని తనలో ఇముడ్చుకున్న భూగర్భుడు, జ్ఞానానికి అధిపతైన మాధవుడు, మధు అనే రాక్షసుడిని సంహరించిన మధుసూధనుడైన విష్ణుమూర్తిని జ్ఞానం కోసం నమస్కరించాలి.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 4, 2025

ఒక్క సాంగ్ వాడినందుకు ఇళయరాజాకు ₹50 లక్షలు చెల్లింపు!

image

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా ‘Dude’ సినిమాపై వేసిన కాపీరైట్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా వాడారని ఆయన చిత్రయూనిట్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ పరిష్కరించుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ సాంగ్ ఉపయోగించినందుకు రూ.50లక్షలు చెల్లిస్తామని ఇళయరాజాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి.

News December 4, 2025

రష్యాతో స్నేహం.. ఎన్ని ఒత్తిళ్లున్నా డోంట్‌కేర్!

image

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా. అందుకే US నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా రష్యాతో ఒప్పందాల విషయంలో ఇండియా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెక్యూరిటీ, డిఫెన్స్, ఎనర్జీ, ట్రేడ్, పెట్రోలియం రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇవి పాక్, చైనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.