News March 27, 2025
సిద్దిపేట: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు వద్దు: CP

జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టవద్దన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 18, 2025
శుభ సమయం (18-09-2025) గురువారం

✒ తిథి: బహుళ ద్వాదశి రా.12.25 వరకు
✒ నక్షత్రం: పుష్యమి ఉ.8.59 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.6.38-ఉ.8.10
News September 18, 2025
కానిస్టేబుల్ నుంచి టీచర్లుగా..

నందికొట్కూరు సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగ మల్లయ్య, ఎం.జ్యోతి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నాగ మల్లయ్య నందికొట్కూరు, జ్యోతి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వీరిని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సన్మానించి, అభినందించారు.