News March 27, 2025
సిద్దిపేట: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు వద్దు: CP

జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టవద్దన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 21, 2025
23న పదో తరగతి ఫలితాలు: డీఈవో సలీం

ఈనెల 23న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలు లీప్ యాప్‌లో పాఠశాల వారీగా కూడా విడుదల చేస్తామని ఆయన వివరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 110 కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో తెలిపారు.
News April 21, 2025
అగ్నివీర్‌కు ఎంపికైన కొండంరాజపల్లి యువకుడు

నంగునూరు మండలం కొండంరాజపల్లి గ్రామానికి చెందిన తిరుపతి- లక్ష్మీ దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు కూలీలు కాగా, అగ్నివీర్‌కు ఎంపిక కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌కు బంధువులు, గ్రామస్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
News April 21, 2025
గిన్నిస్ బుక్ అవార్డు పొందిన సత్తెనపల్లి యువతి

సత్తెనపల్లి యువతికి గిన్నిస్ బుక్ అవార్డ్ దక్కింది. పాపిశెట్టి అనూష 1,046 మంది విద్యార్థులతో గంటపాటు స్వరాలు వాయించినందుకు ఈ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని లైఫ్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సాధించిన అనూషను పలువురు అభినందిస్తున్నారు.