News January 31, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఎడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 17, 2025
‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.
News October 17, 2025
త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం: MLA

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వరంగల్ సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే చెప్పారు.
News October 17, 2025
అమరచింత: కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాల తయారీ

అమ్మాపురంలో వెలసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీలు ప్రతిఏటా పట్టు వస్త్రాలను తయారు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈనెల 22 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలీలు స్వామికి పట్టు వస్త్రాలు తయారీని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 28న ఉద్దాల ఉత్సవం స్వామికి పట్టు వస్త్రాలను అలంకరిస్తారు.