News January 31, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
HYD: సీఎంను కలిసిన జలమండలి ఎండీ

జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.
News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రజాభవన్‌లో సీఎస్‌లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.


