News February 20, 2025
సిద్దిపేట: అమలు చేయకపొతే సస్పెండ్ చేస్తాం: కలెక్టర్

గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించని అధికారులను సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్తో కలిసి గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ ఇంప్లిమెంటేషన్పై ఎస్సీ, ఎస్టీ అర్పీవోలతో, సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 21, 2025
బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి: దేవినేని ఉమా

ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా చట్టం ముందు అందరం సమానమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరవు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నావని అభిమానం ఉప్పొంగిందా అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు.
News November 21, 2025
తిరుపతి: ఆధార్ తప్పులతో ఆగిన ఆపార్..!

ఎన్ఈపీలో భాగంగా ఆధార్ లింక్తో విద్యార్థులకు ఆపార్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,86,167 మంది ఉన్నారు. ఆపార్ వచ్చిన విద్యార్థులు 3,35,534 మంది కాగా.. పెండింగ్లో 50,633 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆపార్ నంబర్ తప్పనిసరి కావాల్సి ఉంది. ఇంటి పేర్లు, పుట్టిన తేదీల్లో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.
News November 21, 2025
ఖమ్మం ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

‘లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.


