News February 1, 2025

సిద్దిపేట: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

image

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News February 23, 2026

జనగామ: ప్రజావాణిలో 78 దరఖాస్తుల స్వీకరణ

image

జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందజేసిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మొత్తం 78 దరఖాస్తులు ప్రజావాణిలో స్వీకరించినట్లు తెలిపారు

News February 23, 2026

NZB: మార్కెట్ కమిటీల సమస్యలు పరిష్కరించాలని వినతి

image

తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు అందకపోవడం, యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

News February 23, 2026

నిజామాబాద్: పసుపు రైతులకు ముఖ్య గమనిక

image

అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.