News January 31, 2025
సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.
Similar News
News February 18, 2025
పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in
News February 18, 2025
రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ జాతర వాల్ పోస్టర్ల ప్రదర్శన

వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల వద్ద వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది అతికిస్తున్నారు. ఈనెల 25 నుంచి 27 గురువారం వరకు మూడు రోజులపాటు వేములవాడలో మహా శివరాత్రి జాతర జరుగుతుందన్నారు. పూజల వివరాలు, సమయాలతో కూడిన పూర్తి వివరాలతో వాల్ పోస్టర్లను రూపొందించామని తెలిపారు.
News February 18, 2025
ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.