News March 18, 2025

సిద్దిపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ప్రాణాలపై తెచ్చుకోవద్దు: సీపీ

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ (ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలని, బెట్టింగ్‌లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు, ఇతర వివరాలు పంపొద్దన్నారు.

Similar News

News April 19, 2025

బాపట్ల: ఉద్యోగాల పేరిట రూ.1.5కోట్ల వసూలు.. మోసగాడి అరెస్ట్

image

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తిని తెనాలి త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్‌లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.1.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

News April 19, 2025

టైట్ డ్రెస్‌లు వేసుకుంటే..

image

టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల నడుము, కాళ్ల వద్ద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి వాపు రావడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. పలు రకాలైన చర్మ సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాల సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 19, 2025

సిద్దిపేట: ‘పంట సాగు, సన్న బియ్యం, తాగునీటిపై సమీక్ష ‘

image

గతంతో పోల్చుకుంటే తెలంగాణలో పంట దిగుబడి రికార్డు స్థాయిలో జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్గాటించారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి దనసరి అనసూయ సీతక్క, పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో కలిసి రభీ 2024-25 పంట సాగు, సన్న బియ్యం పంపిణీ, తాగునీటిపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. కలెక్టర్ మనూచౌదరి పాల్గొన్నారు.

error: Content is protected !!