News April 11, 2025

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

image

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభానికి సన్నద్ధం అయిందన్న మంత్రులు ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ నర్మెట్ట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పరిశీలించామని, త్వరలోనే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు.

Similar News

News December 5, 2025

మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.

News December 5, 2025

సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్యఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.