News April 11, 2025

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

image

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభానికి సన్నద్ధం అయిందన్న మంత్రులు ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ నర్మెట్ట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పరిశీలించామని, త్వరలోనే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు.

Similar News

News February 11, 2026

విజయవాడలో మహిళ ప్రాణం తీసిన అగరబత్తి..!

image

విజయవాడ దోమల నివారణకు వెలిగించిన అగరబత్తి ఓ మహిళ ప్రాణం తీసింది. గుణదలకు చెందిన సుభాషిణి ఆదివారం రాత్రి అగరబత్తి వెలిగించి నిద్రపోగా, అర్ధరాత్రి మంటలు మంచానికి వ్యాపించాయి. ఈ ఘటనలో ఆమె సజీవ దహనమైంది. సోమవారం ఉదయం ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 11, 2026

భద్రాద్రి జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి నోటిఫై చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంగణాల్లో రిసెప్షన్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు

News February 11, 2026

పాదగయలో సామాన్యులకే పెద్దపీట.. VIPలకు ప్రత్యేక సమయాలు!

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించారు. అత్యంత పవిత్రమైన లింగోద్భవ సమయంలో అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.