News April 2, 2024
సిద్దిపేట: ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తా: వెంకట్‌రామ్ రెడ్డి

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్‌రామ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, పేద కుటుంబాలకు ఒక రూపాయి ఖర్చుతో పేరు నమోదు చేసేలా ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు.
Similar News
News December 23, 2025
మెదక్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడిగా వేణు

మెదక్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడిగా వేణు, కార్యదర్శిగా కరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కార్యాలయంలో ఎన్నికలను తెలంగాణ జనరల్ సెక్రటరీ కోరడాల వెంకటేశ్వర్లు, డిస్కమ్ రాష్ట్ర నాయకుల సమక్షంలో నిర్వహించారు. వేణు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
News December 23, 2025
మెదక్: సీనియర్ ఎస్పీగా శ్రీనివాస రావుకు ప్రమోషన్

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు సీనియర్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ 2013 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులను 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఐపీఎస్(వేతన) నియమాలు, 2016 ప్రకారం పే మ్యాట్రిక్స్‌లోని లెవెల్ 13, సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి కోసం ఎంప్యానెల్ చేశారు. ఈ క్రమంలో డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
News December 23, 2025
MDK: నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబం సర్పంచ్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన ఒకే కుటుంబం 4 పర్యాయాలుగా సర్పంచ్ పదవికి ఎన్నికయ్యారు. 2025లో జరిగిన ఎన్నికల్లో శివగోని పెంటా గౌడ్ సర్పంచిగా గెలుపొందారు. 2006లో పెంట గౌడ్ తమ్ముడు రాజాగౌడ్, ఆ తర్వాత జరిగిన 2012, 2018లో జరిగిన ఎన్నికల్లో పెంటాగౌడ్ తల్లి సుగుణమ్మ రెండు పర్యాయాలు సర్పంచ్ పనిచేశారు. రాజాగౌడ్ భార్య ఎంపీటీసీగా సేవలందించారు.


