News July 31, 2024

సిద్దిపేట: ‘ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించాలి’

image

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆయన అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులకు, RBSK వైద్య అధికారులకు, MLHPలకు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News October 14, 2024

సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన

image

అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News October 13, 2024

పుల్కల్: సింగూరులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

image

పుల్కల్ మండలం సింగూరు నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన విటల్ (42) శనివారం సాయంత్రం స్నానం కోసం సింగూరు నదిలోకి వెళ్లారు. సింగూరు దిగువ భాగాన స్నానం చేస్తుండగా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News October 13, 2024

మెదక్‌లో ఈనెల15న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ ఆద్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి టోర్నమెంట్ ఈనెల 15న సెలక్షన్స్ (ఎంపిక పోటీలు) గుల్షన్ క్లబ్ మెదక్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డా. కొక్కొండ ప్రభు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బాల, బాలికలకు ఓపెన్ కేటగిరిలో స్త్రీ, పురుషులకు పోటీలుంటాయని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవ పత్రాలతో డి.రవితేజ, అనిష్‌లను సంప్రదించాలని సూచించారు.