News February 18, 2025
సిద్దిపేట: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. సీపీ అభినందన

ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ 2025 పోటీలలో బంగారు పతకం సాధించిన రశ్మిత రెడ్డిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన చిరుకోటి రశ్మిత రెడ్డి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు.
Similar News
News January 7, 2026
జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.
News January 7, 2026
దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైలు కేవలం నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
News January 7, 2026
సంగారెడ్డి: ఆలస్య రుసుంతో 27 వరకు గడువు

ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తత్కాల్ పథకం కింద రూ.వెయ్యితో చెల్లించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


