News March 19, 2025

సిద్దిపేట: ఆర్థిక అక్షరాస్యత పురోభివృద్ధికి దోహదం: కలెక్టర్

image

ప్రతి వ్యక్తిలోని గుణాత్మకమైన ఆర్థిక అక్షరాస్యత స్థాయి వారి వ్యక్తిగత, కుటుంబాల అభివృద్ధికే కాకుండా, సమాజ ఆర్థికాభివృద్ధికి, దేశ సుస్థిరమైన పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్.గోపాల సుదర్శనం రచించిన “ఫైనాన్షియల్ లిటరసీ” పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.

Similar News

News December 19, 2025

ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ TOP..!

image

మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసించింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు కృషిచేసిన జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వర్లు, DPO జగదీశ్వర్‌ను కలెక్టర్ సన్మానించారు. ఎన్నికల నిర్వహణలో విజయవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ అభినందించారు.

News December 19, 2025

జిల్లాకు 200 పెన్షన్లు.. శుభవార్త చెప్పిన సీఎం

image

AP: కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ IAS కలెక్టర్ల సదస్సులో చెప్పగా CM వెంటనే స్పందించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు జిల్లాకు 200 చొప్పున పెన్షన్ల మంజూరుకు అనుమతి ఇచ్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.

News December 19, 2025

HYD బుక్ ఫెయిర్ మొదలైంది అప్పుడే..!

image

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి DEC 29 వరకు బుక్ ఫెయిర్ జరుగుతుంది. 1985లో మొదట అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ఫెయిర్, తరువాత నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లకు విస్తరించింది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.