News February 4, 2025

సిద్దిపేట: ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు: హరీశ్ రావు

image

అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏంటని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు.

Similar News

News February 18, 2025

తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

image

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

News February 18, 2025

కేసు వాదిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

image

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరు వేణుగోపాల రావు మరణించారు. ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కోర్టు హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. లాయర్ మృతితో మిగతా కోర్టు హాళ్లలో రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.

News February 18, 2025

పెద్దపల్లి: HYD సింగరేణి భవన్ వద్ద నిరసనకు సిద్ధం..!

image

సింగరేణి కార్మికుల విజిలెన్స్ పెండింగ్ కేసులు సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యారు. సింగరేణి మారు పేర్ల సమస్యల పరిష్కారం కోసం 150 మంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. “మా ఉద్యోగాలు మాకు కావాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

error: Content is protected !!