News February 11, 2025

సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలోని 26 మండలాల్లో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలు అందజేసిన వారి ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ ఎం. మను చౌదరి  తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపిడిఓ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బి ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News October 27, 2025

టూత్ పేస్ట్ అనుకోని ఎలుకల మందు తిన్న చిన్నారి మృతి

image

బ్రష్ చేసుకుంటుండగా టూత్‌పేస్ట్‌గా భావించి ఎలుకల మందు తిన్న మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం(D) సింగరేణి(M) గోవింద్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన చిన్నారి ధారావత్ మానస(3) ఈ నెల 17న ఎలుకల మందు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మొదట ఖమ్మం ఆసుపత్రికి, ఆపై HYDకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపి దర్యాప్తు చేస్తున్నారు.

News October 27, 2025

పల్నాడు: ‘రేపు విద్యా సంస్థలకు సెలవు’

image

జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28వ తేదీని సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News October 27, 2025

HYD: కొమురం భీమ్‌కు బీజేపీ ఘన నివాళులు

image

గిరిజన వీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురం భీమ్ త్యాగం, ధైర్యం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, Ex MP.ప్రొ.సీతారాం నాయక్, ST మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.