News February 11, 2025

సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలోని 26 మండలాల్లో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలు అందజేసిన వారి ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ ఎం. మను చౌదరి  తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపిడిఓ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బి ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News March 14, 2026

విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

image

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

News March 14, 2026

రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

image

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 14, 2026

రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.