News August 25, 2024
సిద్దిపేట: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!
అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్దిపేట(D) గజ్వేల్‌కు చెందిన శివ(26) పెయింటర్. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News September 16, 2024
సంగారెడ్డి: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూలు
వాడవాడలా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుగుంటలో శ్రీఏకశిలా వరసద్ధి వినయాక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.2.02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా.. మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.
News September 16, 2024
గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.
News September 16, 2024
సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.