News May 4, 2024
సిద్దిపేట: ఉద్యోగం పేరుతో యువతికి రూ16.45 లక్షలు టోకరా

ఓ యువకుడు ఆన్లైన్ ద్వారా యువతిని మోసం చేసి జైలు పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి గ్రామానికి చెందిన అరవింద్ సిద్దిపేటకు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేశాడు. ఆమె నుంచి రూ.16,75,750ల నగదును ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం ఫోను ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి సిద్దిపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేపట్టి అరవింద్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News December 24, 2025
నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 24, 2025
అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్‌కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.
News December 24, 2025
మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


