News January 18, 2025
సిద్దిపేట: ఉద్యోగం సాధించిన యువతి

సిద్దిపేట జిల్లా చేర్యాలకి చెందిన తుమ్మలపల్లి కనకయ్య, కవితల కుమార్తె నవ్య ENCO AE ఫలితాలలో ఉద్యోగం సాధించారు. బీటెక్ JNTU మంథని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత HYDలో ఉంటూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు.
Similar News
News February 7, 2025
మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.
News February 7, 2025
గజ్వేల్‌లో యాక్సిడెంట్.. ఇద్దరి దుర్మరణం

గజ్వేల్ పరిధిలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గోదావరిఖని నుంచి HYD వైపు వెళ్తున్న కారు, ఆగి ఉన్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
News February 7, 2025
ఆత్మహత్యలు కాదు.. కొట్లాడుదాం.. ప్రజలకు హరీశ్ రావు పిలుపు

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగు మందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. ఆత్మహత్యలు వద్దు.. కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.