News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News November 24, 2025
మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
News November 24, 2025
మంగళగిరి చేనేతలకు గుడ్న్యూస్.. 12% మజూరీకి అంగీకారం

మంగళగిరి చేనేత కార్మికులు 2025-27 కాలానికి 12% మజూరీ రేటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు మంగళగిరి చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. సోమవారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మజూరి పెంపుదలపై సమావేశం నిర్వహించారు. ఆమోదించిన మజూరి ప్రకారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నామని బాలకృష్ణ చెప్పారు.
News November 24, 2025
మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.


