News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News April 24, 2025
వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
News April 24, 2025
పహల్‌గామ్ దాడి.. ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన

పహల్‌గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. అదిల్ హుస్సేన్, అలీ భాయ్ (తల్హా భాయ్), హషీమ్ ముసా (సులేమాన్) ఊహాచిత్రాలతో పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.20లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
News April 24, 2025
రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.