News February 1, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. తుపాకులు అప్పగించండి: CP
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు పొందిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా తీసుకువెళ్లవచ్చని చెప్పారు.
Similar News
News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం: అనంత వెంకటరామిరెడ్డి
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.
News February 2, 2025
NZB: ఉత్తరాది బడ్జెట్‌లా ఉంది: DCC అధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఉత్తరాది బడ్జెట్‌లా ఉందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసి ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్‌కు పైసా ఇవ్వలేదని, గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ ఏర్పాటు చేయలేదన్నారు.
News February 2, 2025
మందమర్రి ఏరియాలో 91%బొగ్గు ఉత్పత్తి: GM
మందమర్రి ఏరియాలో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి 91% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా GM దేవేందర్ తెలిపారు. శనివారం GMకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. డిసెంబర్‌తో పోలిస్తే 14,327టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించామన్నారు. అధికారులు, కార్మికులు సమష్టిగా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.