News February 2, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలపై అదనపు కలెక్టర్ సమీక్ష

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధిత ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్-అదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ, ఉపాధ్యాయ నియోజకవర్గ, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు.
Similar News
News October 19, 2025
కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

కర్నూలు రేంజ్లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News October 19, 2025
MBNR: మద్యం దుణాకాలను 5,142 దరఖాస్తులు

మద్యం దుకాణాల గడువును ప్రభుత్వం 23 వరకు పొడగించింది. నిన్న ఒక్కరోజే 2407 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 5,142 వచ్చాయి. MBNR 1544, NGKL 1423, NRPT 779, GDWL 723, WNP 673 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. నాన్ రిఫండబుల్ విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల ఫీజు ఉండటంతో దరఖాస్తులు రాలేదని పలువురు అంటున్నారు.
News October 19, 2025
కేఆర్‌పురం ITDAకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు

బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ రాష్ట్రంలోనే ఉత్తమ ఐటీడీఏగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. రాములు నాయక్ OCT 17న న్యూ ఢిల్లీలో నిర్వహించిన “ఆది కర్మయోగి జాతీయ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ధాత్రి అభ జనభాగిదారి అభియాన్‌లో చేసిన విశేష కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఐటీడీఏ అవార్డు లభించినట్లు పీవో తెలిపారు.