News February 18, 2025

సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.మను చౌదరి అన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణను ఇచ్చారు.

Similar News

News March 23, 2025

సంగారెడ్డి: నేటితో ముగియనున్న గడువు: డీఈవో

image

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికాలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.

News March 23, 2025

RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

image

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.

News March 23, 2025

కౌటాలలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ

image

కౌటాలలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో టోర్నీ ఉంటుందని, ఒక గ్రామం నుంచి ఒకే టీమ్‌కు అవకాశం ఉందన్నారు. వివరాలకు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!