News February 1, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. తుపాకులు అప్పగించండి: CP

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు పొందిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా తీసుకువెళ్లవచ్చని చెప్పారు.
Similar News
News February 18, 2025
NRPT: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

ఈనెల 19న నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం కళాశాల ఆవరణలో విడుదల చేశారు. పదికి పైగా బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయని అన్నారు. SSC, INTER, DEGREE, PG, ITI, COMPUTER పరిజ్ఞానం ఉన్న వారు మేళాలో పాల్గొనాలని చెప్పారు.
News February 18, 2025
నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
News February 18, 2025
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.