News July 11, 2024
సిద్దిపేట: ఏఎస్ఐ ఉమ్మారెడ్డిపై బదిలీ వేటు

రవి అడ్వకేట్ పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చినందున టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిని సిద్దిపేట టూ టౌన్ నుంచి జిల్లా కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారని అడిషనల్ డిసిపి యస్.మల్లారెడ్డి తెలిపారు. అడ్వకేట్ పై దాడి విషయంలో టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఉపేందర్‌పై ఆరోపణలు రాగా గజ్వేల్ ఏసిపి కే.పురుషోత్తంరెడ్డిని విచారణ అధికారిగా నియమించామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 17, 2025
మెదక్: రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు

నూతనంగా నియామకమైన పోలీస్ సిబ్బందికి రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
News February 17, 2025
మెదక్: ప్రజల సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు త్వరగా పరిశీలించాలని సూచించారు.
News February 17, 2025
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ హరీశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.