News February 25, 2025

సిద్దిపేట: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

image

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Similar News

News February 25, 2025

 రంజాన్ మాసం ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

image

పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మసీదుల వద్ద పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలన్నారు.

News February 25, 2025

ఇంటర్ పరీక్షలుసజావుగా నిర్వహించాలి- కలెక్టర్

image

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News February 25, 2025

ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

image

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్‌ను ఆహ్వానించింది.

error: Content is protected !!