News February 22, 2025
సిద్దిపేట: ‘ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి’

ఫిబ్రవరి 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.
News November 27, 2025
అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు.. 6,541 ఉద్యోగాలు

ఈ నెల 28న అమరావతిలోని సీఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయ పనులకు శంకుస్థాపన జరగనుంది. 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,541 ఉద్యోగాల కల్పన అమరావతిలో జరగనుందని CRDA కమిషనర్ కె. కన్నబాబు IAS బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాబార్డ్, ఆప్కాబ్, ఎల్ఐసీ, NIACLతో పాటు 11 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఏర్పాటు కానున్నాయన్నారు.
News November 27, 2025
మంచిర్యాల: 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు నామినేషన్

మంచిర్యాల జిల్లాలోని తొలి విడతలో 4 మండలాల్లో 90 సర్పంచ్, 816వార్డుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దండేపల్లి (M)లో 31 GPలు, 278 వార్డులు, హాజీపూర్ (M)లో 12 GPలు,106 వార్డులు, జన్నారం (M)లో 29 GPలు, 272 వార్డులు, లక్షెట్టిపేట (M)లో 18 GPలు,160 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.


