News March 3, 2025

సిద్దిపేట: ఐఐటీలు ఆవిష్కరణకు వేదిక కావాలి: ఉపరాష్ట్రపతి

image

ఐఐటీలో నూతన ఆవిష్కరణకు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి ఐఐటీ విద్యార్థులు తోడ్పాటు అందించాలని చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.

News November 27, 2025

సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

image

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.

News November 27, 2025

తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.