News February 11, 2025

సిద్దిపేట ఐటీ టవర్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట ఐటి టవర్‌లో జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న ఫ్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో మరియు ఎఫ్పీఓల సీఈఓ, డైరెక్టర్లతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా క్రిషి కల్ప సీఈఓ సీఎం పాటిల్ ఎఫ్పిఓలు బలోపేతం చేయడానికి చేస్తున్న పనుల గూర్చి కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News December 5, 2025

గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్‌ స్టార్

image

కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్‌ కుమార్‌ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్‌ కుమార్‌ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.

News December 5, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.50 పెరిగి రూ.7,150 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు-అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News December 5, 2025

జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!