News February 11, 2025
సిద్దిపేట ఐటీ టవర్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట ఐటి టవర్‌లో జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న ఫ్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో మరియు ఎఫ్పీఓల సీఈఓ, డైరెక్టర్లతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా క్రిషి కల్ప సీఈఓ సీఎం పాటిల్ ఎఫ్పిఓలు బలోపేతం చేయడానికి చేస్తున్న పనుల గూర్చి కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News March 21, 2025
‘లబ్ధిదారులకు అదనపు సహాయం రూ.6.19 కోట్లు విడుదల’

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.
News March 21, 2025
‘తాగు నీటి సమస్యకు పర్యవేక్షక సెల్ ఏర్పాటు’

గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.
News March 21, 2025
‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్‌తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.