News February 4, 2025
సిద్దిపేట కమిషనరేట్లో 544 అవగాహన కార్యక్రమాలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
Similar News
News November 15, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
News November 15, 2025
DRDOలో 18 అప్రెంటిస్లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News November 15, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు ఐవోగా డీఎస్పీ మహీంద్ర

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసుకు ఐవోగా డీఎస్పీ మహీంద్రను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శనివారం మాట్లాడారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు కొత్తమలుపు తిరిగిందన్నారు. దోషులు ఎంతటి వారైనా ఏస్థాయిలో ఉన్న వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని లిఫ్ట్ చేయడానికి బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.


