News February 4, 2025

సిద్దిపేట కమిషనరేట్‌లో 544 అవగాహన కార్యక్రమాలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News February 9, 2025

HYD: నుమాయిష్@15.10 లక్షలు

image

HYD నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తారు. శనివారం వీకెండ్ కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలిరావడంతో ఎగ్జిబిషన్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దాదాపు 80 వేల మంది సందర్శకులు శనివారం వచ్చారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి నిన్నటి వరకు ఎగ్జిబిషన్‌కు 15.10 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News February 9, 2025

ADB ఎస్పీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు

image

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పెళ్లి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం భోదిలో జరిగిన రిసెప్షన్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆయన భార్య నితికా పంత్‌తో కలిసి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, తదితరులు ఉన్నారు. 

News February 9, 2025

కప్పట్రాళ్ల సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి దుర్మరణం

image

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సమీపంలో శనివారం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన బోయ హనుమంతు, రంగమ్మ దంపతుల కుమారుడు జగదీశ్(25) ఉల్లిగడ్డ లోడుతో వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో జగదీశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి కుమారుడు ఉండగా.. భార్య 5 నెలల గర్భవతి. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!