News February 17, 2025
సిద్దిపేట: కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ విధానం అమలు

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు వివరాల నమోదు కోసం బయోమెట్రిక్ విధానం అమలులోకి తెస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. బయోమెట్రిక్ యంత్రాల ఫిట్టింగ్ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
Similar News
News March 25, 2025
విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
News March 25, 2025
NJACపై నిర్ణయం తీసుకోండి: అలహాబాద్ బార్ అసోసియేషన్

NJACపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కాలిపోవడం తెలిసిందే. కొలీజియం ఆయన్ను అక్కడి నుంచి తమ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని బార్ వ్యతిరేకిస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించింది. జడ్జిల నియామకం కోసం GOVT ఏర్పాటు చేయాలనుకున్న కమిషనే NJAC.
News March 25, 2025
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య

అత్యంత వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మెుత్తం భారీ LED స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా తిలకించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.