News March 19, 2025
సిద్దిపేట: కస్తూర్భాను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి రూం, కిచెన్ సందర్శించి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.
Similar News
News March 20, 2025
60ఏళ్లు గడిచినా రైళ్ల వేగంలో మార్పేది?.. నెట్టింట విమర్శలు

పొరుగు దేశాలు అక్కడి రైళ్ల వేగాన్ని రెట్టింపు చేస్తే ఇండియా మాత్రం ఇంకా 120-130KMPH వేగం వద్దే ఆగిపోయిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనికోసం 1969లో మొదలైన రాజధాని EXPను ఉదహరిస్తున్నారు. ఇది 55ఏళ్ల క్రితమే 120KMPH వేగంతో నడిచే రైలుగా పరిచయమైందంటున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు 130KMPHతో అందుబాటులోకి వచ్చిందని, ఆరు దశాబ్దాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
News March 20, 2025
కండక్టర్‌పై దాడి.. రాజంపేట సీఐ వార్నింగ్

ఈనెల 16వ తేదీన నందలూరు బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడి విషయంలో ఇరు వర్గాల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజంపేట రూరల్ సీఐ కుళ్లాయప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికురాలితో కండక్టర్ ప్రవర్తించిన తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం చెంది దాడి చేశారని, ప్రయాణికులు కండక్టర్‌తో ఆ మహిళకు సారీ చెప్పించడంతో సమస్య అక్కడే పరిష్కారం అయిందన్నారు. కలహాలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News March 20, 2025
బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.