News January 27, 2025
సిద్దిపేట: కాంగ్రెస్ వచ్చాక PRC పత్తా లేకుండా పోయింది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఆర్సి పత్తా లేకుండా పోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎన్జీవో భవన్‌లో ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు పదవి విరమణ పొందుతే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో నిరుత్సాహ పడుతున్నారన్నారు. గతంలో అన్ని ఇచ్చామన్నారు.
Similar News
News March 14, 2025
జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం

జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పరిమితంగా అమలు చేసేందుకు అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం సుప్రీంకోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ ఆర్డర్‌ను అడ్డుకొనే అధికారం జిల్లా కోర్టులు, ఇండివిడ్యువల్ జడ్జిలకు లేదని తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్నవారిని మినహాయించి ట్రంప్ ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. USలో అక్రమ నివాసితులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ట్రంప్ ఆదేశించడం తెలిసిందే.
News March 14, 2025
సిద్దిపేట: మార్చిలోనే మండుతున్న ఎండలు

సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే ఎప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎండలో వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
News March 14, 2025
నాని కేరాఫ్ నయా టాలెంట్

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.