News January 24, 2025
సిద్దిపేట: కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్.!

కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఆపడం సరికాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెన్షన్లలో కోతలు విధించడమంటే.. వారి నోటికాడి బుక్కను లాగేసుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంగనూరు గ్రామ పంచాయతీలో కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లి వృద్ధాప్య పెన్షన్‌లో కోత విధించిన ఘటనపై హరీశ్‌రావు స్పందించారు.
Similar News
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
News December 7, 2025
సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
News December 7, 2025
కొత్తగూడెం: మత్తులో ట్రాక్ దాటుతూ రైలు కిందపడి..

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


