News January 24, 2025

సిద్దిపేట: కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్.!

image

కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. వృద్ధుల‌కు వృద్ధాప్య పెన్ష‌న్లు ఆప‌డం స‌రికాద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పెన్ష‌న్ల‌లో కోత‌లు విధించ‌డ‌మంటే.. వారి నోటికాడి బుక్క‌ను లాగేసుకోవ‌డ‌మే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండ‌లం నంగనూరు గ్రామ పంచాయ‌తీలో కొడుకు ఇంటి ప‌న్ను క‌ట్ట‌లేద‌ని త‌ల్లి వృద్ధాప్య పెన్షన్‌లో కోత విధించిన ఘ‌ట‌న‌పై హ‌రీశ్‌రావు స్పందించారు.

Similar News

News February 18, 2025

బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

image

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.

News February 18, 2025

KMR: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

జిల్లా, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. తహశీల్దార్లు LRS, ధరణి వంటి వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు పన్నులు, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంపై వంటి వాటిపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News February 18, 2025

కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

image

కేయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో ఇద్దరు, డిజిగీక్స్‌ ముగ్గురు, జెన్‌పాక్ట్‌ 35 మంది, డెల్ఫిటీవీఎస్‌ 18 మంది, క్యూస్ప్రైడర్‌ 33 మంది, పెంటగాన్‌ స్పేస్‌ 10 మంది, ఎకోట్రైన్స్‌లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.

error: Content is protected !!