News March 4, 2025

సిద్దిపేట: కులగణన రీ సర్వేకు అవకాశం ఇచ్చాం: మంత్రి

image

కులగణన రీ సర్వేకు సంబంధించి గత నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. కులగణనను తమిళనాడు మాదిరిగా షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకుల దేనన్నారు.

Similar News

News November 6, 2025

NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

image

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 6, 2025

స్టైలింగ్ ఇలా మార్చుకోండి

image

చాలామంది అమ్మాయిలు ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవని ఫీల్ అవుతుంటారు. మీ స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఉన్నవాటినే రంగులూ, డిజైన్లవారీగా విభజించి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకొని మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తారు.

News November 6, 2025

భీమవరం: కలెక్టరేట్ శాశ్వత భవనం ఎక్కడ..?

image

పశ్చిమ గోదావని జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం ఎక్కడ చేయాలనే అంశంపై కొంతకాలం పెద్ద వివాదం నడిచింది. జిల్లాలోని పెద్ద చర్చి ప్రదేశం అంశంగా కూడా ఈ వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వివాదాలు కనుమరుగై, కలెక్టరేట్ ఊసే లేకుండా పోయింది. భీమవరంలో నిర్మిస్తారా, ఉండిలో ఏర్పాటు చేస్తారా లేక నరసాపురం తరలిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.