News March 4, 2025

సిద్దిపేట: కులగణన రీ సర్వేకు అవకాశం ఇచ్చాం: మంత్రి

image

కులగణన రీ సర్వేకు సంబంధించి గత నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. కులగణనను తమిళనాడు మాదిరిగా షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకుల దేనన్నారు.

Similar News

News March 17, 2025

జనగామ: ఇంటర్మీడియట్ పరీక్షల సరళి పరిశీలించిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని సోమవారం జనగామ జిల్లాలోని ధర్మకంచలోని ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరును అధికారుల నుంచి తెలుసుకున్నారు.

News March 17, 2025

రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానం: శైలజ

image

BHPL జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన “రాజీవ్ యువ వికాసం పథకం” ప్రకటించిందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ తెలిపారు. కావున అర్హత, ఆసక్తి కలవారు OBMMS ఆన్‌లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని ఆమె ప్రకటనలో తెలిపారు.

News March 17, 2025

BHPL: ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

image

ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై వచ్చేవారం సమగ్ర నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.

error: Content is protected !!