News March 23, 2024
సిద్దిపేట: కొడుకూ, కూతురితో బావిలో దూకిన తల్లి

MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి సిద్దిపేట జిల్లా కక్కెర్లపాడు చెందిన లావణ్యతో పెళ్లి జరిదింది. కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News November 26, 2025
మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.
News November 26, 2025
MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


