News April 25, 2024
సిద్దిపేట కోర్టులో తొలిసారి హిజ్రాకు జాబ్

సిద్దిపేటలోని ఇందిరానగర్‌కు చెందిన హిజ్రా ప్రశాంతికి పొరుగు సేవ కింద జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి నియామకపత్రం అందజేశారు. హిజ్రాలకు సమాన హక్కు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారి ఉద్యోగ అవకాశం కల్పించామని, వారు ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Similar News
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
News January 22, 2026
మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.